బీజేపీని టెన్షన్ పెట్టడానికి మరోసారి ఉద్యమం
భారతీయ జనతా పార్టీని మరోసారి ఇరుకున పెట్టడానికి రైతు సంఘాలు ఫిక్స్ అయ్యాయి
భారతీయ జనతా పార్టీని మరోసారి ఇరుకున పెట్టడానికి రైతు సంఘాలు ఫిక్స్ అయ్యాయి. మళ్లీ రైతు ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. 2020-21లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన రైతు సంఘాల ఐక్య వేదిక 'సంయుక్త కిసాన్ మోర్చా' ఇటీవలే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో రైతుల సమస్యలపై పోరాడడానికి మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ, రైతుకూలీలకు పింఛన్లు, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయడం వంటి పెండింగ్లో ఉన్న డిమాండ్లపై తమ ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. తమ డిమాండ్ల గురించి తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలవడానికి కూడా అపాయింట్మెంట్లు కోరుతామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.