Mon Dec 23 2024 12:49:14 GMT+0000 (Coordinated Universal Time)
కొడుకుకి ఊహించని షాకిచ్చిన తండ్రి.. కోడలితో పరార్
ఇటీవల ఆమెను తీసుకుని కొడుకు బైక్ పైనే పరారయ్యాడు. దాంతో పవన్ తండ్రే తన భార్యను తప్పుదారి పట్టించాడంటూ
ఓ తండ్రి తన కొడుకుకి ఊహించని షాకిచ్చాడు. కోడలితో ప్రేమలో పడిన ఆ వ్యక్తి.. ఆమెను తీసుకుని కొడుకు బైక్ పై ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని బుందీ జిల్లాలో వెలుగుచూసింది. తండ్రి తనకు చేసిన నమ్మకద్రోహం నుంచి తేరుకోలేకపోయాడు బాధితుడు. చివరకు పోలీసులను ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. తండ్రిపై ఫిర్యాదు చేశాడు. తన భార్య అమాయకురాలని, తప్పంతా తండ్రిదేనని చెప్పడం కొసమెరుపు.
వివరాల్లోకి వెళ్తే.. సిలోర్ గ్రామానికి చెందిన పవన్ వైరాగికి భార్య, ఆరు నెలల కూతురు ఉన్నారు. అయితే.. అతడి తండ్రి రమేశ్ వైరాగి కోడలికి దగ్గరయ్యాడు. ఇటీవల ఆమెను తీసుకుని కొడుకు బైక్ పైనే పరారయ్యాడు. దాంతో పవన్ తండ్రే తన భార్యను తప్పుదారి పట్టించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య అమాయకురాలని చెప్పుకొచ్చాడు. ఇదే కాకుండా.. తన తండ్రి చట్టవ్యతిరేకమైన పనులను కూడా చేసేవాడని ఆరోపించాడు. ఉద్యోగం వల్ల తాను ఇంటికి దూరంగా ఉన్న క్రమంలో ఈ దారుణం జరిగిందని పవన్ పోలీసుల ఎదుట వాపోయాడు.
కానీ.. పోలీసులు తన ఫిర్యాదును సీరియస్ గా తీసుకోవడం లేదని కూడా పవన్ ఆరోపించాడు. దాంతో స్పందించిన పోలీసులు.. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మామ-కోడలు ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా.. కొంతకాలం క్రితం కూడా రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. భర్తకు ఫూటుగా మద్యం తాగించిన ఓ మహిళ.. అల్లుడితో పరారయింది.
Next Story