Mon Dec 23 2024 17:17:50 GMT+0000 (Coordinated Universal Time)
మద్యం మత్తులో కూతురిపై అత్యాచారం..
కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యక్తి తన భార్య, 10 సంవత్సరాల కూతురితో నివాసముంటున్నాడు. భార్య పనికోసం బయటికి వెళ్లడంతో..
కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. ఆమె పాలిట దుర్మార్గుడి అవతారమెత్తాడు. మద్యం మత్తులో వావి వరసలు మరిచిపోయిన ఆ కర్కశ తండ్రి.. కామాంధుడిలా మారి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారు ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో 37 ఏళ్ల వ్యక్తి తన భార్య, 10 సంవత్సరాల కూతురితో నివాసముంటున్నాడు.
భార్య పనికోసం బయటికి వెళ్లడంతో..
పనికోసం భార్య బయటకు వెళ్లడంతో.. మద్యం మత్తులో ఉన్న ఆ భర్త 5వ తరగతి చదువుతున్న తన కూతురిపై కన్నేశాడు. కన్నకూతురు అని మరిచిపోయి.. అత్యాచారానికి తెగబడ్డాడు. పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లికి బాలిక జరిగిన ఘోరం గురించి వివరించింది. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని, ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచి పల్లడం సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Next Story