Thu Dec 19 2024 05:44:16 GMT+0000 (Coordinated Universal Time)
Loksabha Elections : ఐదో విడత పోలింగ్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేడు ఐదో విడత పోలింగ్ ప్రారంభమయింది
![Loksabha Elections : ఐదో విడత పోలింగ్ ప్రారంభం Loksabha Elections : ఐదో విడత పోలింగ్ ప్రారంభం](https://www.telugupost.com/h-upload/2024/05/20/1618727-polling.webp)
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేడు ఐదో విడత పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్టు చేసింది.
49 స్థానాల్లో...
ఈ ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ వంటి వారు పోటీ చేసే స్థానాల్లో కూడా నేడు ఎన్నిక జరగనుంది. ఉత్తర్ప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలతో పాటు ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ ప్రారంభమయింది. జమ్ముకశ్మీర్లో ఒకటి, లడక్లో ఒక స్థానానికి కూడా పోలింగ్ జరుగుతుంది.
Next Story