Sun Nov 17 2024 17:46:46 GMT+0000 (Coordinated Universal Time)
Loksabha Elections : రేపటితో ఆఖరి విడత పోలింగ్
రేపు లోక్ సభ తుదివిడత పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది
రేపు లోక్ సభ తుదివిడత పోలింగ్ జరగనుంది. చివరి విడతలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ ఆరు విడతలుగా పోలింగ్ దేశ వ్యాప్తంగా జరిగింది. ఆరు విడతల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఏడో విడత ఎన్నికల బరిలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
57 స్థానాలకు...
ఉత్తర్ప్రదేశ్ లో పదమూడు, పంజాబ్ లో పదమూడు, పశ్చిమ బెంగాల్లో తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితో పాటు బీహార్ లో ఎనిమిది, హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు, జార్ఖండ్ లో మూడు స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఒడిశా లో ఆరు, చండీఘడ్ లో ఒక లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. రేపు జరిగే ఎన్నికల్లో ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
Next Story