Mon Dec 23 2024 09:54:08 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. అగ్నిప్రమాదంలో కుటుంబం సజీవదహనం
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాఢనిద్రలో ఉండటంతో మంటల్లోనే కాలిపోయారు. మృతుల్లో భార్యా భర్తలతో..
లుథియానా : పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమవ్వగా.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున లుథియానాలోని తాజ్ పూర్ రోడ్డులోని ఓ గుడిసెలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాఢనిద్రలో ఉండటంతో మంటల్లోనే కాలిపోయారు. మృతుల్లో భార్యా భర్తలతో పాటు వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మరో కుమారుడు రాజేశ్ (17) ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ బృందంతో వచ్చి మంటలను ఆర్పివేశారు. కానీ.. అప్పటికే కుటుంబసభ్యులంతా మంటల్లో చిక్కుకుని కాలిపోవడంతో.. ఎవరినీ ప్రాణాలతో రక్షించలేకపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story