Sat Nov 23 2024 00:27:39 GMT+0000 (Coordinated Universal Time)
వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో మంటలు
భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలును కుర్వాయి కెతోరా..
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత.. దేశంలోని పలు ప్రాంతాల్లో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతవారం యాదాద్రి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లోనూ మంటలు చెలరేగి ఏకంగా నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదం పగటివేళ జరగడంతో వెంటనే ప్రయాణికులను సిబ్బంది అప్రమత్తం చేసి రైలు నుంచి దించివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తాజాగా.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు కూడా తృటిలో ప్రమాదం తప్పింది. ఎక్స్ ప్రెస్ బ్యాటరీ బాక్స్ లో పొగలు రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు. ఈ ఘటన భోపాల్ లోని కుర్వాయి కెతోరా స్టేషన్ వద్ద జరిగింది.
భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలును కుర్వాయి కెతోరా స్టేషన్ వద్ద నిలిపివేశారు. రైలు బోగీలో నుంచి మంటలు, పొగలు వస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భోపాల్ - హజ్రత్ నిజాముద్దీన్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ 20171 రైలు సోమవారం ఉదయం 5.40 గంటలకు భోపాల్ లోని రాణి కమల్పతి స్టేషన్ నుంచి బయల్దేరింది. బినా సిటీ రైల్వే స్టేషన్ ముందు కుర్వాయి కెతోర వద్ద సి-14 బోగీలో నుంచి మంటలు చెలరేగాయి. ఉదయం 7.10 గంటల సమయంలో రైలును కుర్వాయి కెతోర స్టేషన్లో నిలిపివేయగా.. ప్రయాణికులు వెంటనే రైలు దిగేశారు. ఆ బోగీలో పవన్ కుమార్ అనే వ్యక్తి.. తాను కూర్చున్న సీటు కింది నుంచి మంటలు చెలరేగాయని, బ్యాటరీ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా.. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 1న ప్రారంభించారు.
Next Story