Thu Dec 12 2024 20:49:11 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్ గఢ్ లో మరోసారి కాల్పులు - 12 మంది మావోల మృతి
ఛత్తీస్ గఢ్ లో మరోసారి కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పదిహేడు మంది మావోయిస్టులు మరణించారు.
ఛత్తీస్ గఢ్ లో మరోసారి కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పదిహేడు మంది మావోయిస్టులు మరణించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో జల్లెడ పడుతున్న భద్రతాదళాలకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు మొదలయ్యాయి.
కొనసాగుతున్న కాల్పులు...
అయితే మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు దిగారని పోలీసులు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మరణించారని పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Next Story