Sat Dec 28 2024 21:27:03 GMT+0000 (Coordinated Universal Time)
తొలి యాపిల్ స్టోర్ ప్రారంభం
భారత్ లో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభమయింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు
భారత్ లో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభమయింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. దీనిని ఈరోజు యాపిల్ బీకేసీ స్టోర్ సీఈవో టీమ్ కుక్ ప్రారంభించారు. ఆయన ఈ యాపిల్ స్టోర్ ను ప్రారంభించి వినియోగదారులకు అందుబాటులోకి యాపిల్ ప్రొడక్ట్స్ ను తెస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 20వ తేదీ నుంచి మాత్రమే స్టోర్ లోకి వినియోగదారులను అనుమతిస్తారు.
ఎల్లుండి నుంచి...
యాపిల్ సంస్థ తయారు చేసే వస్తువులకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. విదేశాల నుంచి ఎక్కువ మంది యువత వీటిని దిగుమతి చేసుకుంటుంటారు. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తారు. కానీ స్టోర్ అందుబాటులోకి రావడంతో ముంబయి యువత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దదాపు 22 వేల చదరపు విస్తీర్ణంలో ఈ స్టోర్ ను ఏర్పాటు చేశారు. లాంస్ ఏంజిల్స్, న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగపూర్ నగరాల్లో మాత్రమే యాపిల్ స్టోర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా రోజుల తర్వాత ఇండియాలోని ముంబయిలో ఏర్పాటు చేశారు.
Next Story