Mon Nov 18 2024 06:53:30 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం ?
భారత్ లో ఒమిక్రాన్ క్రమంగా విజృంభిస్తోంది. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించినట్లు తెలుస్తోంది.
భారత్ లో ఒమిక్రాన్ క్రమంగా విజృంభిస్తోంది. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించినట్లు తెలుస్తోంది. పూణెకు చెందిన వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించినట్లు సమాచారం. మృతుడు ఇటీవలే నైజీరియా నుంచి పూణే కు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. దేశంలో తొలి ఒమిక్రాన్ మరణంపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తే తప్ప.. ఈ మరణంపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. కాగా.. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో ఒమిక్రాన్ మరణాలు సంభవించగా.. ఇప్పుడు భారత్ లోనూ ఒమిక్రాన్ మరణం నమోదైతే మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. భారత్ లో రెండు కేసులతో మొదలైన ఒమిక్రాన్ కేసుల నమోదు.. ఇప్పుడు ఏకంగా వెయ్యి మార్కును దాటేసింది.
5 రెట్లు వేగంతో..
డిసెంబర్ 2వ తేదీన కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. ఇప్పుడీసంఖ్య 1200 దాటేసింది. ప్రస్తుతం దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. దీనిని బట్టి ఒమిక్రాన్ వ్యాప్తి ఎంతవేగంగా జరుగుతుందో అంచనా వేయొచ్చు. రెండు కేసుల నుంచి 500 కేసుల రీచ్ అవ్వడానికి 25 రోజుల సమయం పడితే.. 500 కేసుల నుంచి వెయ్యి కేసులు రీచ్ అవ్వడానికి నాలుగంటే నాలుగు రోజులే పట్టిందంటే ఒమిక్రాన్ తన రూపాన్ని ఎలా మార్చుకుంటుందో చూడండి. గడిచిన 8 రోజుల్లోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో అత్యధికంగా 450 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. 320 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. ఇక కేరళలో 109, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, తమిళనాడులో 46 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
Next Story