Sun Dec 22 2024 15:23:26 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రంలో జికా వైరస్ తొలి కేసు
కర్ణాటక రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు నమోదయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
కర్ణాటక రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు నమోదయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది. డెంగ్యూ, చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముగ్గురు రోగుల నుంచి సీరమ్ శాంపిల్స్ సేకరించి పూనేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.
అప్రమత్తమైన ప్రభుత్వం...
పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. చిన్నారికి రక్తనమూనాలను పరిశీలించిన తర్వాత పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.
Next Story