Mon Dec 23 2024 07:30:43 GMT+0000 (Coordinated Universal Time)
కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్
నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న..
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసుల సంయుక్త బృందాలు ఈ తెల్లవారుజామున గాలింపు ప్రారంభించాయి. భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఈ నెల 13న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ నెల 2న రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటి వరకూ మొత్తం 9 మంది ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశారు.
Next Story