Mon Dec 23 2024 18:40:27 GMT+0000 (Coordinated Universal Time)
హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ వే పై వేగంగా వస్తున్న కారు షీలత్నే వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీ కొట్టి
మహారాష్ట్రలోని ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ వే పై ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. లోనావాలాలోని షీలత్నే వద్ద ఓ కారు భారీ కంటైనర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read : ఖమ్మంజిల్లాలో పెద్దపులి సంచారం.. ఆందోళనలో ప్రజలు
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ వే పై వేగంగా వస్తున్న కారు షీలత్నే వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీ కొట్టిన అనంతరం.. రోడ్డుకు అవతలి వైపుకు దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న కంటైనర్ కింద కారు ఇరుక్కుపోయింది. కారు కంటైనర్ కిందికి దూసుకెళ్లడంతో.. నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కుర్లాకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. కారును వెలికితీసి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story