Mon Dec 23 2024 04:50:27 GMT+0000 (Coordinated Universal Time)
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేకు రూ.2,62,200 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేకు రూ.2,62,200 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో రూ.1,08,795 కోట్లు రైలు ప్రయాణ భద్రతా వ్యవస్థను మెరుగుపరడానికి వినియోగించనున్నట్లు తెలిపారు. పాత ట్రాక్స్ స్థానంలో కొత్త ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం,ఫ్లై ఓవర్స్, అండర్ పాసెస్ నిర్మాణం, కవచ్ ఇన్స్టాలేషన్ కోసం ఖర్చు చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.
డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2500 అదనపు జనరల్ కోచ్ లను తీసుకొస్తున్నామన్నారు. మరో 10వేల సాధారణ కోచ్ లను తయారు చేపట్టామని తెలిపారు. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ కేటాయింపుల సాయంతో వందే మెట్రో, వందే భారత్, అమృత్ భారత్ వంటి ప్రాజెక్టులు కూడా కవర్ అవుతాయని మంత్రి తెలిపారు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆప్టికల్ ఫైబర్, టెలికాం టవర్, ఆన్ ట్రాక్ సిస్టమ్, డేటా సెంటర్ అడ్మినిస్ట్రేషన్‌తో కూడిన ‘కవచ్ 4.0’ సేఫ్టీ సిస్టమ్‌కు భారతీయ రైల్వే ఇటీవలే ఆమోదం తెలిపింది. ఇది వేగవంతంగా ఇన్స్టాల్ చేస్తామని వైష్ణవ్ తెలిపారు.
Next Story