Sat Nov 16 2024 07:24:48 GMT+0000 (Coordinated Universal Time)
11 నెలల బాలుడి కడుపులో పిండం.. ఎందుకిలా ?
కొద్దిరోజులుగా చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. కుటుంబ సభ్యులు అపేక్ష ఆస్పత్రికి తీసుకొచ్చారు. అన్ని పరీక్షలు చేసిన..
పుట్టిన కొద్ది నెలలకే చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో.. వైద్యులు బాలుడిని పరిశీలించారు. తీరా చూస్తే.. 11 నెలల బాలుడి కడుపులో పిండం ఉన్నట్టు తేలింది. దాంతో బాలుడికి శస్త్ర చికిత్స చేసి.. కడుపులో ఉన్న పిండాన్ని తొలగించారు వైద్యులు. ఈ ఘటన అసోంలో వెలుగుచూసింది. దిబ్రూగఢ్ జిల్లాలోని అపేక్ష ఆస్పత్రిలో బాలుడికి వైద్యులు శస్త్రచికిత్స చేసి.. కడుపులో ఉన్న 2 కిలోల పిండాన్ని తొలగించారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్లాంగ్ జిల్లాకు చెందిన బాలుడకి ఈ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. కొద్దిరోజులుగా చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. కుటుంబ సభ్యులు అపేక్ష ఆస్పత్రికి తీసుకొచ్చారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు బాలుడి కడుపులో పిండం ఉందని గుర్తించి.. ఆపరేషన్ చేసి దానిని తొలగించారు. గతేడాది నవంబర్ లో 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలుండగా.. అప్పుడు కూడా శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించారు.
ఇలా పిల్లల కడుపులో పిండం ఉండటాన్ని వైద్య పరిభాషలో ఫీటర్ ఇన్ ఫీటూ అంటారని వైద్యులు తెలిపారు. దీనికి చేసే శస్త్రచికిత్స జాగ్రత్తగా చేయకపోతే.. కిడ్నీల నుండి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతోన్న సమయంలో.. ఓ పిండం పూర్తిగా వద్ధి చెందకుండా.. వృద్ధి చెందుతోన్న మరో పిండంలో అలాగే ఉండి చనిపోతుందని.. అందువల్లే ఫీటస్ ఇన్ ఫీటు సమస్య ఏర్పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
Next Story