Fri Nov 22 2024 11:20:59 GMT+0000 (Coordinated Universal Time)
తొక్కిసలాట ఘటనపై భోలే బాబా ఏమన్నారంటే?
ఉత్తర్ప్రదేశ్ లో జరిగిన దుర్ఘటనపై తొలిసారి భోలే బాబా స్పందించారు.
ఉత్తర్ప్రదేశ్ లో జరిగిన దుర్ఘటనపై తొలిసారి భోలే బాబా స్పందించారు. ఆరోజు ఘటనతో తాను వేదనకు గురయ్యాయని తెలిపారు. ఇంతమంది మరణించడం చాలా బాధాకరమన్న భోలే బాబా తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు ఆ బాధను భరించే శక్తిని ఇవ్వాలని నమ్ముతున్నానని తెలిపారు.
బాధ్యులైన వారిని...
తనకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందని, మృతులు, గాయపడిన వారికి అండగా ఉండాలని తాను ఇప్పటికే కమిటీ సభ్యులకు సూచించినట్లు ఆయన తెలిపారు హాత్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించగా వందల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడుగా పేర్కొన్న దేవ్ ప్రకాశ్ మధుకర్ ఢిల్లీలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భోలేబాబాపై మాత్రం కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Next Story