Fri Jan 10 2025 15:35:41 GMT+0000 (Coordinated Universal Time)
114 ఏళ్ల టేకు చెట్టు.. ధర ఎంతంటే?
కేరళలో 114 ఏళ్ల నాటి టేకు చెట్టుకు అటవీ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఈ వేలంలో అనేక మంది వ్యాపారులు పాల్గొన్నారు
అతి పురాతనమైన టేకు చెట్టుకు అత్యంత ఎక్కువగా ధర పలికింది. టేకుకు మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు కూడా ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో 114 ఏళ్ల నాటి టేకు చెట్టుకు అటవీ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఈ వేలంలో అనేక మంది వ్యాపారులు పాల్గొన్నారు. వారిలో ఒక టింబర్ డిపో యజమాని అశోక్ కుమార్ 39.5 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు.
వేలంలో కొనుగోలు చేసిన...
వేలంలో అనేక మంది వ్యాపారులు పాల్గొన్నా చివరకు ఈ భారీ టేకు చెట్టు అశోక్ కుమార్ సొంతమయింది. దీంతో ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం లభించింది. బ్రిటీష్ కాలంలో ఈ చెట్టును నాటారు. 114 ఏళ్ల నుంచి అటవీ శాఖ అధికారులు ఈ చెట్టును కాపాడుకుంటూ వస్తున్నారు. 1909లో నాటిన ఈ చెట్టును కాపాడుకుంటూ వచ్చినప్పటికీ చివరకు ఎండిపోయి పడి పోవడంతో దీనిని అటవీ శాఖ అధికారులు వేలం వేయాల్సి వచ్చింది. అత్యంత నాణ్యమైన టేకు కావడంతో ఎక్కువ ధర పలికిందని అధికారులు చెబుతున్నారు.
Next Story