Thu Dec 26 2024 04:16:00 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : నేడు హర్యానాకు కేజ్రీవాల్
నేడు హర్యానాలోతీహార్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
నేడు హర్యానాలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో హర్యానా ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో ఆయన పాల్గొన్ననున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయనున్నారు.
సొంత రాష్ట్రం కావడంతో...
హర్యానా సొంత రాష్ట్రం కావడంతో అరవింద్ కేజ్రీవాల్ ఈ రాష్ట్రంలో గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమ్ ఆద్మీపార్టీని హర్యానాలో బలోపేతం చేశారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొనున్నారు. మాజీ సీఎం హోదాలో మెగా రోడ్ షో లో పాల్గొంటారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు హర్యానాలోని యమునానగర్ జిల్లా, జగద్రి నియోజకవర్గం లో రోడ్డు షో నిర్వహించనున్నారు.
Next Story