Sun Dec 22 2024 23:49:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి పదిహేడు నెలల నుంచి మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉంటున్నారు. ఆయన అనేక సార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో జైల్లోనే ఉంటున్నారు. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో....
అయితే తాజాగా మనీష్ సిసోడియా కు బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన మనీలాండరింగ్ కు పాల్పడ్డారని కూడా ఆరోపణలు చేసింది. మొత్తం మీద మనీష్ సిసోడియాకు బెయిల్ దక్కడంతో ఊరట కలిగినట్లయింది.
Next Story