Thu Dec 05 2024 02:08:18 GMT+0000 (Coordinated Universal Time)
స్వర్ణదేవాలయం వద్ద కాల్పులు.. మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్యంగా
స్వర్ణదేవాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు
పంజాబ్ లోని అమృత్ సర్ లో కాల్పులు జరిగాయి. స్వర్ణదేవాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. స్వర్ణ దేవాలయంలో శిక్ష లో భాగంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయం ఎంట్రెన్స్ వద్ద కాపలాదారుగా సుఖ్ బీర్ సింగ్ కూర్చున్నారు. దీంతో ఒక వృద్ధుడు ఆయనను సమీపించి తుపాకీ తో కాల్పులు జరిపాడు.
కాల్పులు జరిపిన వ్యక్తి..
వెంటనే సుఖబీర్ సింగ్ భద్రతాసిబ్బంది కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే సుఖ్ బీర్ సింగ్ ఈ కాల్పుల ఘటనలో ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. నిందితుడిని నరైన్ సింగ్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇతను గతంలో బబ్బర్ ఖల్సా అనే ఉగ్రవాదసంస్థలో పనిచేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద స్వర్ణ దేవాలయంలో కాల్పులు కలకలం సృష్టించాయి.
Next Story