Sun Apr 27 2025 01:00:16 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : పీవీ నరసింహారావుకు భారత రత్న
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధానినరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు కాంగ్రెస్ హయాంలో ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన అమలు చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల నేడు దేశంలో అభివృద్ధి జరిగిందని ఆర్థిక నిపుణులు మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తాయి.
మరో ముగ్గురికి...
అలాంటి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు మరో ముగ్గురికి కూడా మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ కు కూడా భారతరత్న ను ప్రకటించింది. ఇటీవల బీజేపీ నేత ఎల్కే అద్వానీ, బీహార్ కు చెందిన కర్పూరీ ఠాగూర్ కి కూడా భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. మన తెలుగోడికి భారతరత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తమవుతున్నాయి.
Next Story