Sun Dec 22 2024 23:13:29 GMT+0000 (Coordinated Universal Time)
Panneerselvam : ఎన్నికల బరిలో ఐదుగురు పన్నీర్ సెల్వంలు.. అందరి ఇంటిపేర్లు ఒకటే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన రామనాధపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. పన్నీర్ సెల్వం స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఒకే పేరుతో మరో నలుగురు పన్నీర్ సెల్వంలు బరిలో ఉండటమే. అందరూ పన్నీర్ సెల్వం అని పేరున్న వాళ్లే. గుర్తులు వేరు కానీ పేర్లు ఒక్కటే కావడం విశేషం.
రామనాధపురంలో...
రామనాధపురంలో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు మరో నలుగురు పన్నీర్ సెల్వంలు బరిలో ఉన్నారు. వారందరి పేర్లు కూడా పన్నీర్ సెల్వంలే. అంతే కాదు ఆ నలుగురి ఇంటిపేర్లు కూడా మొదటి అక్షరం ఓ. దీంతో రామనాధపురం ఈవీఎంలో మొత్తం ఐదుగురు ఓ. పన్నీర్ సెల్వంలు పోటీ చేస్తున్నారు. అందరినీ పోటీ చేయడానికి ఎన్నికల కమిషన్ అధికారులు అనుమతించారు. అందరి నామినేషన్లు ఆమోదం పొందడంతో ఇక్కడ పోటీలో పన్నీర్ సెల్వంకు నలుగురు పన్నీర్ సెల్వంలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. ఒకే పేరు ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతారని ఓపీఎస్ అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
Next Story