Mon Dec 23 2024 18:58:41 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka : రాహుల్ ద్రావిడ్ క్యూ లో నిలబడి మరీ
టీం ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తన ఓటు హక్కును బెంగళూరు నగరంలో వినియోగించుకున్నారు
కర్నాటకలో నేడు రెండో విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. అయితే ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీం ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తన ఓటు హక్కును బెంగళూరు నగరంలో వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ ద్రావిడ్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
సిద్ధరామయ్య కూడా...
అలాగే అనేక మంది రాజకీయ నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ఓటు హక్కును మైసూరులో వినియోగించుకున్నారు. సిద్ధరామయ్య మైసూరుకు సమీపంలోని వరుణ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ గ్రామం కొడగు లోక్సభ నియోజకవర్గం పరిధికి వస్తుంది. ఆయనతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
Next Story