Mon Dec 23 2024 10:07:18 GMT+0000 (Coordinated Universal Time)
"ఇస్కాన్" మోసపూరిత సంస్థ
మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇస్కాన్ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ దారుణమైన మోసాలకు పాల్పడుతుందని అన్నారు.
మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇస్కాన్ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సంస్థ దారుణమైన మోసాలకు పాల్పడుతుందని అన్నారు. గోశాలల నిర్వహణ పేరుతో ఆవులను కసాయి వాళ్లకు విక్రయిస్తున్నారంటూ మేనకాగాంధీ ఆరోపించారు. ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన మేనకా గాంధీపై ఇస్కాన్ సంస్థ అభ్యంతరం తెలియజేస్తుంది.
గోవులను అమ్మేసి...
ఇస్కాన్ సంస్థ దేశంలోనే అతి పెద్ద మోసపూరిత సంస్థ అని ఆమె అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ది పొందుతూ మోసాలకు పాల్పడుతుందన్నారు. అనంత్పూర్ గోశాలకు తాను వెళ్లినప్పుడు అక్కడ ఒక గోవు కూడా లేదని ఆమె తెలిపారు. ఆవులను కసాయి వాళ్లకు విక్రయించడమేంటని ఆమె ప్రశ్నించారు. వీళ్లంతా హరే రామ్ హరే కృష్ణ అంటూ భజనలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. వీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలంటూ మేనకాగాంధీ కొట్టిపారేశారు. అయితే మేనకాగాంధీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు.
Next Story