Tue Nov 05 2024 15:28:53 GMT+0000 (Coordinated Universal Time)
బస్టాండ్ లో నిలిపి ఉన్న బస్సులు ఎండల దెబ్బకు బూడిదయిపోయాయే
బస్టాండ్ లో నిలిపి ఉంచిన నాలుగు బస్సులు ఎండల తీవ్రతకు దగ్దమయ్యాయి.
దేశంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులు బయటకు రావడానికే జంకుతున్నారు. వడదెబ్బ తగిలి మృత్యువాత పడుతున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా మండే ఎండలకు ప్రతి ఒక్క ప్రాణి ఇబ్బందులుపడుతుంది.
వాహనాలు కూడా...
అయితే వాహనాలు కూడా ఎండల తీవ్రతకు కాలిపోతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులు ఎండల దెబ్బకు తగలపడిపోయాయి. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. బస్టాండ్ లో నిలిపి ఉంచిన నాలుగు బస్సులు ఎండల తీవ్రతకు దగ్దమయ్యాయి. ఒడిశాలోని రాయగడ జిల్లా బిసంకటక్ లో ఎండల తీవ్రతకు నాలుగు బస్సులు బూడిదయ్యాయి. అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రయాణికులు బస్సుల నుంచి దిగిపోయారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Next Story