Mon Dec 23 2024 12:05:10 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు 14 విమానాలకు బాంబు బెదిరింపులు
ఈరోజు పథ్నాలుగు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫేక్ ఫోన్ కాల్స్ విమాన ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి.
ఫేక్ ఫోన్ కాల్స్ విమాన ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. కేవలం ప్రయాణికులనే కాదు విమానయాన సిబ్బందితో పాటు భద్రతా సిబ్బందికి కూడా ఫేక్ కాల్స్ తలొనొప్పిగా తయారయ్యాయి. ఈరోజు పథ్నాలుగు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అన్ని విమానాలను ఎయిర్పోర్టులో గంటల కొద్దీ నిలిపేసి తనిఖీలు నిర్వహించారు. చివరకు ఏమీ లేదని తేల్చారు. వీటిని ఫేక్ కాల్స్ గా చివరకు గుర్తించి ఇటు ప్రయాణికులు అటు భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఆరు రోజుల్లో వంద కాల్స్...
ఫేక్ కాల్స్ అని నమ్మాలా? వద్దా? అన్నది కూడా విమానయాన సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఫేక్ కాల్, ఈ మెయిల్ వచ్చిన వెంటనే విమానాలను నిలిపేయడం, తనిఖీలు చేయడం మామూలుగా మారిపోయింది. గత ఆరు రోజుల్లో వంద విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి దీంతో అనేక విమానాశ్రాయాల్లో విమానాలను నిలిపేసి ప్రయాణికులను కిందకు దించేసి తనిఖీలను చేపట్టారు. ప్రయాణికులకు తమ గమ్యస్థానం చేరడానికి కారణమయింది. ఈ ఫేక్ కాల్స్ పై విమానయాన సంస్థ దర్యాప్తు జరుపుతున్నా ఫేక్ కాల్స్ మాత్రం రావడం ఆగడం లేదు.
Next Story