Mon Dec 23 2024 16:44:17 GMT+0000 (Coordinated Universal Time)
కేసులు భారీగా.. లైట్ తీసుకుంటున్న జనం
భారత్ లో ఫోర్త్ వేవ్ ప్రారంభమయినట్లే కనపడుతుంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య దేశంలో పెరుగుతుంది.
భారత్ లో ఫోర్త్ వేవ్ ప్రారంభమయినట్లే కనపడుతుంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య దేశంలో పెరుగుతుంది. అయితే ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకుంటున్నాయి. ఈ వేవ్ పెద్ద ప్రమాదకరం కాదని ఎవరికి వారే సర్ది చెప్పుకుంటున్నారు. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రజల్లో వైరస్ భయం అనేది లేకుండా పోయింది.
మరణాలు...
ఇప్పుడు కరోనా సోకినా కేవలం ఇంట్లోనే ఉండి ఐదు రోజుల పాటు చికిత్స చేయించుకుని తిరిగి విధులకు వెళుతున్నారు. ఒక్కరోజులోనే భారత్ లో 16,159 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా 28 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. నిన్న కరోనా నుంచి 15,394 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కోలుకున్న వారి శాతం 98.53 శాతంగా ఉందని చెబుతున్నారు.
యాక్టివ్ కేసులు...
కాకుంటే భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది. యాక్టివ్ కేసుల శాతం 0.26 కాగా, రోజువారీ పాజిటివిటీ శాతం 3.56 శాతానికి పెరిగింది. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,25,270 మంది మరణించారు. కరోనా బారిన పడి దేశంలో ఇప్పటి వరకూ 4,29,07,327 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,15,212 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,98,20,86,763 వ్యాక్సిన్ డోసులు వేశారు.
Next Story