Fri Dec 20 2024 06:03:27 GMT+0000 (Coordinated Universal Time)
గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి "FREE FIRE" తొలగింపు
పబ్జీలోని చాలా అంశాలు ఫ్రీ ఫైర్ గేమ్ లోనూ ఉంటాయి. గరెనా సంస్థ ఈ గేమ్ ను భారత్ లోకి తీసుకొచ్చింది. అయితే.. ప్రస్తుతం గూగుల్,
పబ్జీ.. ఈ గేమ్ కు ఎంతమంది బానిసలయ్యారో లెక్కలేదు. తిండీ తిప్పలు మానేసి మరీ.. రేయింబవళ్లు ఈ గేమ్ లోనే ఉండిపోయేవాళ్లు కోకొల్లలు. భారత్ లో కూడా పబ్జీకి ఫ్యాన్స్ ఎక్కువే. కానీ.. చైనా సరిహద్దుల్లో వివాదం, కరోనా కారణాలతో భారత్ పబ్జీ సహా.. పలు చైనా యాప్ లను నిషేధించింది. ఆ తర్వాత అచ్చం పబ్జీని పోలి ఉండే ఫ్రీ ఫైర్ వచ్చింది. పబ్జీకి బానిసలైన వారంతా ఫ్రీ ఫైర్ కు అడిక్ట్ అయ్యారు. పబ్జీలోని చాలా అంశాలు ఫ్రీ ఫైర్ గేమ్ లోనూ ఉంటాయి. గరెనా సంస్థ ఈ గేమ్ ను భారత్ లోకి తీసుకొచ్చింది. అయితే.. ప్రస్తుతం గూగుల్, యాపిల్ ప్లే స్టోర్లలో ఫ్రీ ఫైర్ కనిపించడం లేదు. దాంతో ఫ్రీ ఫైర్ ను బ్యాన్ చేశారంటూ వార్తలొస్తున్నాయి.
పబ్జీ డెవలపర్ సంస్థ క్రాఫ్టన్ ఇటీవలే గరెనా సంస్థపై లా సూట్ వేసింది. తమ పబ్జీలో ఉన్న చాలా అంశాలను కాపీకొట్టి గరెనా సంస్థ ఫ్రీ ఫైర్ ను రూపొందించిందని, గరెనాకు చెందిన ఫ్రీ ఫైర్ యాప్ ను నిషేధించాలని క్రాఫ్టన్ కోరింది. ఈ క్రమంలోనే గూగుల్, యాపిల్ సంస్థలు తమ ప్లే స్టోర్లలో ఫ్రీ ఫైర్ ను నిషేధించినట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే గరెనా సంస్థ స్పందించాల్సిందే. కాగా.. ఫ్రీ ఫైర్ ద్వారా గరెనా సంస్థకు 2021లో 414 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా.. పబ్జీ ద్వారా క్రాఫ్టన్ కు 639 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది.
Next Story