Sun Dec 22 2024 18:24:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడే గగన్ యాన్ లో కీలక ఘట్టం
పారాచూట్ల సాయంతో టీవీ-డీ1 దిగుతుంది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్‌యాన్ మిషన్ చేపట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 8 గంటలకు గగన్‌యాన్ టెస్ట్ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ‘క్రూ ఎస్కేప్ వ్యవస్థ’ పనితీరును పరీక్షించనున్నారు. క్రూ మాడ్యూల్ వ్యవస్థను నేడు పరీక్షించనున్నది. అనుకోని ప్రమాదం తలెత్తితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా చూసే లక్ష్యంతో ఈ పరీక్షను చేపడుతున్నారు. ఇందులో భాగంగా డీ1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్‌ని నింగిలోకి పంపనున్నారు. అయిదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్ చేశారు.
శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్ నిర్వహించనున్నారు. క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం.. ఆ తర్వాత సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సంబంధించిన టెస్ట్ చేయనున్నారు. పీడనం లేని క్రూ మాడ్యూల్లో వ్యోమగాములను నింగిలోకి పంపించనున్నారు. అయితే ప్రస్తుతం చేయనున్న పరీక్షల్లో ఈ క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపి.. అక్కడి నుంచి సేఫ్‌గా బంగాళాఖాతంలో ల్యాండ్ చేయనున్నారు. టీవీ-డీ1మాడ్యూల్ 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మళ్లీ భూమి మీదకు వస్తుందని ఇస్రో తెలిపింది. పారాచూట్ల సాయంతో టీవీ-డీ1 దిగుతుంది.
Next Story