Mon Dec 23 2024 08:27:16 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka results : గాలి జనార్థన్ రెడ్డి గెలుపు
కర్ణాటక ఎన్నికల్లో బళ్లారి ప్రాంతంలోని గంగావతి నుంచి పోటీ చేసిన గాలి జనార్థన్ రెడ్డి గెలుపొందారు.
కర్ణాటక ఎన్నికల్లో బళ్లారి ప్రాంతంలోని గంగావతి నుంచి పోటీ చేసిన గాలి జనార్థన్ రెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించారు. గాలి జనార్థన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకుని 45 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించారు. అయితే గాలి జనార్థన్ రెడ్డి కారణంగా బీజేపీ ఓట్లు చీలిపోయాయి. దీంతో అనేక చోట్ల కాంగ్రెస్కు లాభం చేకూరింది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పార్టీని పెట్టుకుని అభ్యర్థులను బరిలోకి దింపారు.
మిగిలిన వారెవ్వరూ...
మరోవైపు గాలి జనార్థన్ రెడ్డి సతీమణి అరుణ, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు. గాలి జనార్థన్ రెడ్డి ఒక్కరే గెలిచారు. ఆయన బళ్లారి ప్రాంతానికి న్యాయస్థానం షరతులతో రాకపోయినా గెలుపును తన ఇంటి వద్దకే రప్పించుకున్నారు. కానీ మిగిలిన చోట్ల మాత్రం ఆయన నిలబెట్టిన అభ్యర్థులందరూ ఓటమి దిశగా పయనిస్తున్నారు.
Next Story