Mon Dec 23 2024 10:02:44 GMT+0000 (Coordinated Universal Time)
భర్త, కుమారుడిని కట్టేసి.. మహిళపై గ్యాంగ్ రేప్ !
భర్త, కుమారుడిని కట్టేసి.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి
దేశంలో ఏదొక మూల.. నిత్యం ఆడపిల్లలపై, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. భర్త, కుమారుడిని కట్టేసి.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అక్కడే కుములిపుట్ పంచాయతీకి చెందిన మీణా హరిజన్.. అతని స్నేహితులు సదరు వ్యక్తి భార్యపై కన్నేశారు.
Also Read : ఆప్ఘనిస్తాన్ : ఆర్మీలోకి సూసైడ్ బాంబర్లు
ఇంట్లోకి వెళ్లి భర్తను, కుమారుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. జరిగిన దారుణంపై బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మీణా హరిజన్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. మహిళపై ఇంతటి దారుణానికి పాల్పడిన కామాంధులకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story