Mon Dec 23 2024 18:30:56 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడు ఇంటర్ ఫలితాల్లో అయోమయం..100కి 138 మార్కులు
తమిళనాడులో దిండికల్ జిల్లాకు చెందిన నందిని అనే విద్యార్థినికి 600 లకు 600 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న..
ఇటీవల తమిళనాడులో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అయోమయం నెలకొంది. విద్యార్థుల మార్కుల జాబితాలు ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నాయి. నూటికి నూరు మార్కులొచ్చినా అంత ఆశ్చర్యపోరు కానీ.. నూటికి ఏకంగా 138 మార్కులొచ్చాయి. ఈ మార్కులే ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఓ విద్యార్థినికైతే 600కి 514 మార్కులొచ్చినా పాస్ అవ్వకపోవడం ఆందోళన కలిగించింది.
తమిళనాడులో దిండికల్ జిల్లాకు చెందిన నందిని అనే విద్యార్థినికి 600 లకు 600 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్.. విద్యార్థినిని పిలిచి అభినందించారు. నందిని తదుపరి విద్యకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. మధురై లో ఆర్తి అనే విద్యార్థినికి 100కు 138 మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తం 600 మార్కులకు 518 మార్కులొచ్చినా ఆమె ఫెయిల్ అయిందని చూపించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. మార్కులపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Next Story