Mon Dec 23 2024 13:53:53 GMT+0000 (Coordinated Universal Time)
వింత ఘటన.. మనిషి ముఖంతో పుట్టిన మేక పిల్ల !
చార్ జిల్లాలో మేక కడుపున మనిషి ముఖంతో మేక పిల్ల జన్మించింది. ఈ వింత ఘటనను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
దేశంలో అప్పుడప్పుడూ పలు వింతలు జరుగుతుంటాయి. మనిషి కడుపున జంతువు పుట్టడం. ఆవు దూడకు రెండు తలలుండటం. వినాయకుని ముఖంతో మనిషి జననం ఇలాంటి వింత ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా అస్సాంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కచార్ జిల్లాలో మేక కడుపున మనిషి ముఖంతో మేక పిల్ల జన్మించింది. ఈ వింత ఘటనను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
మేకకు పుట్టిన పిల్లకు మనిషి ముఖం ఉండటం చూసిన వారంతా ఇదెక్కడి వింత అంటూ నోరెళ్లబెడుతున్నారు. ధోలాయ్ విధాన సభ నియోజకవర్గంలోని గంగాపూర్ గ్రామంలో ఘటన జరిగింది. అచ్చం మనిషి ముఖం లాగే ఉంది ఆ మేకపిల్ల ముఖం. కళ్లు, ముక్కు, నోరు మాత్రం మనిషి ఈ ముఖాన్ని పోలి ఉండగా.. చెవులు మాత్రం మేకను పోలి ఉంది. సాధారణంగా మేకపిల్లకు నాలుగు కాళ్లుంటాయి. కానీ ఈ శిశువుకు మాత్రం రెండే కాళ్లుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Next Story