Mon Dec 23 2024 09:10:59 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్కు చేరుకున్న గోదావరి ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు గోదావరి ఎక్స్ప్రెస్ కొద్దిసేపటి క్రితం చేరుకుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు గోదావరి ఎక్స్ప్రెస్ కొద్దిసేపటి క్రితం చేరుకుంది. బీబీ నగర్ వద్ద పట్టాలు తప్పిన రైలును 16 బోగీలతో రైలును సికింద్రాబాద్ కు చేర్చినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే శాఖ సిబ్బంది మర్మమత్తులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే జీఎం తెలిపారు.
ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో....
ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో సికింద్రాబాద్ కు చేర్చినట్లు రైల్వే అధకారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీలను సవరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఉదయం 6.15 గంటలకు తమకు రైలు పట్టాలు తప్పిందని, వెంటనే చర్యలు ప్రారంభించామని దక్షిణమధ్య రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. హైడ్రాలిక్ జాకీల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. పక్క ట్రాక్ నుంచి రైళ్లను పంపుతున్నారు.
Next Story