Mon Dec 23 2024 07:56:26 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధర ఎంత పెరిగిందంటే?
బంగారం ధర కాస్త పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర
బంగారం ధర కాస్త పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.210 పుంజుకొని.. రూ.60,160 వద్ద ట్రేడవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1943 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం సెషన్ కంటే పెరిగిందని చెప్పొచ్చు. ఇక స్పాట్ సిల్వర్ రేటు కూడా ఎగబాకింది. ఔన్సుకు 23.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,310 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్స్ రూ. 60,160గా ఉంది. విశాఖలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి రూ. 75,100 గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి రూ. 78,500గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 78,500వద్ద కొనసాగుతోంది. విశాఖలో కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది. ముంబైలో రూ. 75,100 ఉండగా.. బెంగళూరులో రూ. 74,500గా నమోదైంది.
Next Story