Sat Nov 23 2024 07:17:24 GMT+0000 (Coordinated Universal Time)
షాకిస్తున్న బంగారం ధరలు
హైదరాబాద్ లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు ధరలు పెరిగాయి. ప్రస్తుతం
హైదరాబాద్ లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు ధరలు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 150 పెరిగి రూ. 55 వేల 150 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి రూ. 160 పెరిగి రూ. 60 వేల 160 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,310 గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,150 , 24 క్యారెట్స్ ధర రూ. 60,1603 వద్ద కొనసాగుతోంది. కోల్కతాలో 22 క్యారెట్స్ రూ. 55,150 , 24 క్యారెట్ల ధర రూ. 60,160 గా ఉందని చెబుతున్నారు. చెన్నైలో 22 క్యారెట్స్ ధర రూ. 55,450 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150 గా ఉండగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,600 , చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,700 , బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,500 గా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై ఏకంగా 10 డాలర్ల మేర దిగి వచ్చింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు గ్లోబల్ మార్కెట్లో 1939 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Next Story