Mon Dec 23 2024 11:16:41 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలనుకుంటున్న వాళ్లకు శుభవార్త
బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్లో ఆగష్టు 3న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్లో ఆగష్టు 3న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,260గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 77,300లుగా ఉంది. గత 24 గంటల్లో కిలో వెండి ధరపై రూ. 700 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,300గా ఉండగా.. చెన్నైలో రూ. 80,300గా ఉంది. హైదరాబాద్లో రూ. 80,300లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,300ల వద్ద కొనసాగుతోంది.బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 గా నమోదైంది.
Next Story