Mon Dec 23 2024 10:38:46 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం-వెండి ధరల్లో ఎంత మార్పు వచ్చిందంటే?
బంగారం ధరలు పరుగులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు
బంగారం ధరలు పరుగులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు పెరిగాయి. శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,490గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,640గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,490గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,800లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,870 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,490గా నమోదైంది.
వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 పెరిగింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర శుక్రవారం రూ. 78,400లుగా ఉంది. హైదరాబాద్లో రూ. 81,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 81,500ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 78,400గా ఉండగా.. చెన్నైలో రూ. 81,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,250 గా నమోదైంది.
Next Story