Mon Dec 23 2024 17:46:50 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధర ఎంతంటే?
గత కొద్దిరోజులుగా బంగారం ధర తగ్గుతూ రాగా.. నేడు
గత కొద్దిరోజులుగా బంగారం ధర తగ్గుతూ రాగా.. నేడు కొంచెం పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర మాత్రం పెరిగింది. బులియన్ మార్కెట్లో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,620గా ఉంది. గత 24గంటల్లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 పెరిగింది. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,770గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,620గా నమోదైంది.
వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర నేడు రూ. 73,000లుగా ఉంది. హైదరాబాద్లో రూ. 76,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 76,200ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా.. చెన్నైలో రూ. 76,200గా.. బెంగళూరులో రూ. 73,000గా నమోదైంది.
Next Story