Mon Dec 23 2024 14:59:24 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
24 క్యారెట్స్ 10 గ్రాములు బంగారం ధర రూ. 60 వేలు దాటేసింది. 22 క్యారెట్స్ తులం బంగారం
24 క్యారెట్స్ 10 గ్రాములు బంగారం ధర రూ. 60 వేలు దాటేసింది. 22 క్యారెట్స్ తులం బంగారం రూ. 54,950గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా కిలో వెండి ధర రూ. 75,100 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1944.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు స్థిరంగా ఉంది. ఒక ఔన్సుకు ప్రస్తుతం 23.61 డాలర్ల వద్ద ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్స్ ధర రూ. 60,570గా ఉంది. ముంబైలో 22 క్యారెట్స్ రూ. 55,400, 24 క్యారెట్ల ధర రూ. 60,440 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్స్ రూ. 55,550, 24 క్యారెట్స్ రూ. 60,600 ఉండగా... బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150, 24 క్యారెట్స్ రూ. 60,160 నమోదైంది. హైదరాబాద్లో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖలో 22 క్యారెట్స్ ధర రూ. 55,150, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,160గా ఉంది.
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,100గా ఉంది. ముంబైలో రూ. 75,100గా నమోదైంది. చెన్నైలో రూ. 78,500 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ. 74,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి రూ. 78,500గా ఉంది. విజయవాడలో కిలో సిల్వర్ ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.
Next Story