Mon Dec 23 2024 16:01:27 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. బంగారం ధర తగ్గిందోచ్
బంగారం కొనాలనుకుంటున్నారా.. ధర కాస్త తగ్గిందండోయ్..! హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం
బంగారం కొనాలనుకుంటున్నారా.. ధర కాస్త తగ్గిందండోయ్..! హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 100 తగ్గింది. దీంతో ధర రూ. 54,150 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి ప్రస్తుతం రూ. 59,070 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 54,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర ఢిల్లీలో 10 గ్రాములకు 59,220 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,570లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,560 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,150లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070లుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర భారీగా దిగివచ్చింది. కిలో వెండి రేటు రూ. 700 తగ్గి ప్రస్తుతం రూ. 72,300 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లోనూ కిలో వెండి రేటు రూ.1000 పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ. 75,700కి చేరింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం రేటు స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు ప్రస్తుతం 1925 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు స్వల్పంగా పుంజుకుంది. ప్రస్తుతం 23.11 డాలర్ల మార్క్ వద్ద కొనసాగుతోంది.
Next Story