బంగారం ధర తగ్గిందోచ్
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 22 క్యారెట్లపై 24 క్యారెట్స్ బంగారం రేటు వివరాలు ఇలా ఉన్నాయి
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 22 క్యారెట్లపై రూ.100 తగ్గి రూ.54,600 వద్ద ఉండగా 24 క్యారెట్స్ బంగారం రేటు రూ.100 పడిపోయి రూ.59,560 వద్ద ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్లకు తాజాగా రూ. 100 తగ్గి రూ.54,450 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.100 తగ్గి రూ.59,410 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు తగ్గినా సిల్వర్ రేట్లు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ.100 పెరిగి రూ.73,400 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో చూస్తే ఇక్కడ కూడా కిలో వెండి రేటు రూ.100 పెరిగి రూ.76,800 వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది.