Sat Nov 23 2024 10:59:01 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం ధరలలో ఎంత మార్పు వచ్చిందంటే?
ప్రస్తుతం మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
బంగారం ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరపై రూ. 160 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,160గా ఉంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,000గా కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,350లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర బుధవారం రూ. 77,000లుగా ఉంది. గత 24 గంటల్లో కిలో వెండి ధర రూ. 500 తగ్గింది. హైదరాబాద్లో రూ. 80,000లుగా నమోదైంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,000గా ఉంది. చెన్నైలో రూ. 80,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,000 ఉంది.
Next Story