Mon Nov 18 2024 00:49:17 GMT+0000 (Coordinated Universal Time)
శుభవార్త... ఈరోజు రేట్లు ఇలా?
బంగారం ధరలు ఎప్పటికప్పడు పెరుగుతూనే ఉంటాయి. దానికి అనేక కారణాలు చెబుతుంటారు.
బంగారం ధరలు ఎప్పటికప్పడు పెరుగుతూనే ఉంటాయి. దానికి అనేక కారణాలు చెబుతుంటారు. బంగారానికి ఉన్న డిమాండ్ ప్రకారం రోజు వారీ ధరలను నిర్ణయించే అవకాశాలను కొట్టిపారేయలేం. భారత్ లో బంగారానికి ఉన్న మక్కువ కారణంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే పెళ్లిళ్ల సీజన్ లో అయితే చెప్పలేం. జ్యుయలరీ దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ తగ్గుతుండటం వంటి కారణాలు కూడా బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి కారణాలుగా చెబుతుంటారు. అయితే తగ్గినప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
స్థిరంగా ధరలు....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లోనూ ఎటువంటి మార్పు లేదు. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉండటం కొంత ఊరట కల్గించే విషయం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంారం, వెండి ధరల ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,200 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,000లు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 60,700 రూపాయలుగా ఉంది.
Next Story