Mon Nov 18 2024 10:45:29 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్... స్థిరంగా బంగారం ధర
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి
బంగారం పట్ల భారతీయులకు మక్కువ. ముఖ్యంగా మహిళలు ఇష్పపడే బంగారానికి భారత్ లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. సీజన్ లేకుండా కొనుగోళ్లు ఉంటుండటంతో బంగారం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. బంగారం ధరలు పెరిగినా తగ్గినా ఎవరూ కేర్ చేయరు. తమ వద్ద డబ్బులు ఉంటే చాలు బంగారాన్ని కొనుగోలు చేయడానికే భారతీయ మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తున్న వాళ్లు రోజురోజుకు అధికం కావడంతో దాని డిమాండ్ కూడా ఎప్పటికీ పడిపోదు. పెళ్లిళ్ల సీజన్ ముగియడం, శ్రావణ మాసం కూడా కంప్లీట్ కావడంతో బంగారం కొనుగోళ్లు తగ్గాయని చెప్పడానికి వీలులేదు. తమ ఇంట్లోకి బంగారు వస్తువును తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. అందుకే జ్యుయలరీ షాపులు నిత్యం కళకళలాడుతుంటాయి.
వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,890 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,650 రూపాయలు పలుకుతుంది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 58,200 రూపాయలు ఉంది.
Next Story