Wed Nov 20 2024 07:23:39 GMT+0000 (Coordinated Universal Time)
వెండే బంగారమాయెనా?
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపైన రూ.400లు, కిలో వెండి పైన 4,400లు పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా తొలుత ఆ ప్రభావం పడేది బంగారం ధరలపైనే. అంతర్జాతీయ సంఘటన ప్రభావం చూపే ఏకైక వస్తువు బంగారమే. అందుకే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో? చెప్పలేం. ఇక భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బంగారం కొనుగోళ్లు నిత్యం జరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ. ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు సాగుతుంటాయి. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ బంగారం ధర పెరిగిందంటే దానికి ఉన్న విలువ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ధరలు ఇలా....
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపైన రూ.400లు, కిలో వెండి పైన 4,400లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,410 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,810 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి పై 4,400 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 74,700 రూపాయలుగా ఉంది.
Next Story