Mon Nov 18 2024 08:53:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది. వెండి కిలోపై రూ.1400లు పెరిగింది
సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. బంగారం ప్రతి భారతీయుల ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. వస్త్రాలంకరణలో మార్పులు సంభవించినా ఆభరణాల విషయాల్లో మగువల ఇష్టం మాత్రం మారలేదు. అందుకే భారత్ లో భాగంగా మారిన బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కేంద్రీయ బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడుదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. బంగారాన్ని ఇష్టపడే ప్రతి మహిళ పొదుపు చేసి మరీ కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. అందుకే దానికి విలువ ఎప్పుడూ తగ్గదు.
వెండి కూడా...
ఇక తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది. వెండి కిలోపై రూ.1400లు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,890లు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,650లు గా ఉంది. ఇక హైదరాబాద్ లో వెండి ధరలు బాగా పెరిగాయి. కిలో వెండి 59,500 రూపాయలు పలుకుతుంది.
Next Story