Mon Nov 18 2024 06:39:53 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం మహా ప్రియం... కొనడం కష్టమేనా?
బంగారం అంటే అందరికీ ప్రియమే. దాని ధరలు ఎప్పుడు ఎందుకు పెరుగతాయో? ఎందుకు తగ్గుతాయో చెప్పలేం
బంగారం అంటే అందరికీ ప్రియమే. దాని ధరలు ఎప్పుడు ఎందుకు పెరుగతాయో? ఎందుకు తగ్గుతాయో చెప్పలేం. ఇందుకు కారణాలు సాంకేతికంగా అనేకం కనిపిస్తున్నా బంగారం ధరల హెచ్చు,తగ్గుదలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటం కనిపిస్తుంది. ధరలను ఎవరూ లెక్క చేయడం లేదు. గతంలో కొనుగోళ్లు అధికంగా ఉండే సీజన్ లోనే ధరలు పెరిగేవి. కాని ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా ధరలు పెరుగుతున్నాయంటే అదే కారణం. ఇక కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కూడా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి కారణాలుగా చెప్పాలి.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారంపై పది గ్రాములకు 170 రూపాయలు, కిలో వెండిపై రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,870 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,550 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 62,000 రూపాయలకు చేరుకుంది.
Next Story