Fri Jan 03 2025 00:01:40 GMT+0000 (Coordinated Universal Time)
చెప్పలా.. మళ్లీ పెరిగాయ్
దేశంలో ఈరోజు బంగారం వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. కిలో వెండి ధర పై రూ.300లు పెరిగింది
బంగారం అంటే అంతే మరి. ధరలు తగ్గాయని సంతోషపడే సమయం పట్టదు అవి పెరగడానికి. బంగారం ధరలు ఎప్పుడూ పరుగులు తీయడమే. ఆగడం అతి స్వల్పంగానే. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం వంటి కారణాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడం, దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్లో పెరగడంతో మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయడం భారంగా మారింది.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. కిలో వెండి ధర పై రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,850 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,930 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 80,700 రూపాయలు పలుకుతుంది.
Next Story