Fri Nov 15 2024 17:16:48 GMT+0000 (Coordinated Universal Time)
బహుశ ఇక తగ్గవేమో?
ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి.
అసలే పెళ్లిళ్ల సీజన్.. ఆ పైన అక్షర తృతీయ.. ఇంకేముంది బంగారం ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. దీనికితోడు కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, దిగుమతులు భారత్ తగ్గించడం వంటి కారణాలుగా ధరల పెరుగుదలకు కారణంగా మారాయి. పెరుగుతున్న బంగారం ధరలు మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయి. అలా అని కొనుగోళ్లు తగ్గాయని చెప్పలేం. ఎందుకంటే సంప్రదాయాలను పాటించాల్సి రావడంతో ఎక్కువ మొత్తాన్ని వెచ్చించైనా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో జ్యుయలరీ షాపులు కిటికట లాడుతున్నాయి.
వెండి అంతే...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,050 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,150 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 81,300 రూపాయలుగా కొనసాగుతుందని మార్కెట్లోని ధరలు చెబుతున్నాయి.
Next Story